Bhu Bharathi Land Details ఎలా చెక్ చేయాలి? Step-by-Step Guide

On: August 15, 2026 11:13 AM
Bhu Bharathi Land Details

మీ భూమికి సంబంధించిన వివరాలు Online లో తెలుసుకోవాలంటే ఇప్పుడు Bhu Bharathi Portal ద్వారా check చేసుకోవచ్చు. గతంలో Land Records కోసం Office కి వెళ్లి వివరాలు తెలుసుకోవాల్సి వచ్చేది. ఇప్పుడు కొన్ని భూ రికార్డు సేవలను online లోనే access చేసుకునే అవకాశం ఉంది. అయితే Portal లో ఏ Option ఎక్కడ ఉంటుంది, ఏ Details ఇవ్వాలి అనే విషయం మొదటిసారి ఉపయోగించే వారికి కొంచెం Confusing గా అనిపించవచ్చు.

ఈ Guide లో Bhu Bharathi లో Land Details ఎలా చెక్ చేయాలి?, Survey Number తో ఎలా search చేయాలి?, Pattadar Passbook Number ద్వారా ఎలా చూడాలి?, details కనిపించకపోతే ఏం చేయాలి? అనే విషయాలను సింపుల్‌గా చూద్దాం.

Bhu Bharathi ద్వారా భూమి వివరాలు చెక్ చేయడానికి ఏమి కావాలి?

ముందుగా మీ భూమికి సంబంధించిన Basic Details దగ్గర ఉంచుకోవడం మంచిది. సాధారణంగా అవసరమయ్యే వివరాలు:

• జిల్లా (District)

• మండలం (Mandal)

• గ్రామం (Village)

• సర్వే సంఖ్య / ఉప-విభాగ సంఖ్య (Survey No / Sub-Division No)

• లేదా Pattadar Passbook Number

మీ దగ్గర Pattadar Passbook లేదా పాత land documents ఉంటే Survey Number, Passbook Number వంటి వివరాలను సులభంగా గుర్తించవచ్చు.

Bhu Bharathiలో Land Details ఎలా చెక్ చేయాలి?

మీ భూమికి సంబంధించిన వివరాలను Online లో చూడాలంటే Bhu Bharathi Portal లో Land Details Search service ను ఉపయోగించవచ్చు. మీ దగ్గర Survey Number లేదా Pattadar Passbook Number ఉంటే Search చేయడం సులభంగా ఉంటుంది.

Step 1: Bhu Bharathi Website ను Open చేయండి

ముందుగా Telangana Bhu Bharathi Portal అధికారిక Website Open చేయండి. Website open చేసిన తర్వాత Land Records కు సంబంధించిన Services లో మీకు అవసరమైన Option ను ఎంచుకోవచ్చు.

Bhu Bharathi Portal Home Page
Bhu Bharathi Portal Home Page

Step 2: “Land Details Search” Option ను Select చేయండి

Portal లో Land Details Search Option ను గుర్తించి Select చేయండి. ఇది మీ భూమికి సంబంధించిన Available Land Record Information Search చేయడానికి ఉపయోగపడుతుంది. Website లో Menu లేదా Service పేర్లు మారితే, ఆ సమయంలో కనిపించే సంబంధిత Land-Details Option Select చేయండి.

Land Details Search
Land Details Search Option Select

Step 3: Search Option ను ఎంచుకోండి

తర్వాత Land Details ఏ Information తో search చేయాలో select చేయాలి. మీకు అందుబాటులో ఉన్న option ను బట్టి – Survey Number / Sub-Division Number లేదా Pattadar Passbook Number వీటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. మీ దగ్గర ఉన్న Document ను బట్టి Convenient గా ఉండే Search Option ఉపయోగించండి.

Step 4: Survey Number Option ఎంచుకున్నట్లయితే

ఇప్పుడు మీ భూమి ఉన్న ప్రాంత వివరాలను ఒక్కొక్కటిగా Select చేయాలి – District → Mandal → Village ఈ మూడు Details ను సరిగ్గా ఎంచుకోవడం చాలా ముఖ్యం. తప్పు Village లేదా Mandal Select చేస్తే మీరు వెతుకుతున్న Land Record కనిపించకపోవచ్చు. అందుకే మీ Passbook లేదా ఇతర Land Documents లో ఉన్న Location Details తో ఒకసారి Check చేసుకుని Select చేయడం మంచిది.

Survey Number Sub-Division Number
Survey Number Sub-Division Number Through

Step 5: Pattadar Passbook Number ఎంచుకున్నట్లయితే

Pattadar Passbook Option ఎంచుకుంటే Pattadar Passbook Number ను నమోదు చేయండి. Number Enter చేసిన తర్వాత ఒకసారి మళ్లీ Check చేయండి. ఒక్క Digit తప్పుగా ఉన్నా సరైన Record రావకపోవచ్చు.

Pattadar Passbook Number
Use Pattadar Passbook Number

Step 6: Captcha Code Enter చేయండి

Search form లో కనిపించే Captcha Codeను కూడా Enter చేయాలి. Captcha సరిగ్గా నమోదు చేశారో చూసుకుని Next Stepకు వెళ్లండి.

Step 7: “Fetch Details”పై Click చేయండి

అన్ని వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత Fetch Details button పై Click చేయండి. Record Portal లో Available గా ఉంటే, మీ Searchకు సంబంధించిన Land Details Screen పై కనిపిస్తాయి.

అక్కడ కనిపించే Owner/Pattadar Details, Land Extent, Classification, Status వంటి Information ను పరిశీలించవచ్చు. అయితే ముఖ్యమైన Property Transactions కు ముందు ఈ వివరాలను సంబంధిత Official Records తో Verify చేయడం మంచిది.

Land Details కనిపించకపోతే ఏం చేయాలి?

కొన్నిసార్లు Details Enter చేసినా Record కనిపించకపోవచ్చు. అలా జరిగితే వెంటనే Record లేదని అనుకోవాల్సిన అవసరం లేదు. ముందుగా ఈ విషయాలను Eheck చేయండి:

  • సరైన District Select చేశారా?
  • Mandal Correct గా ఉందా?
  • Village సరైనదేనా?
  • Survey Number లో Digit Mistake ఉందా?
  • Sub-Division Number అవసరమైతే అది సరైనదేనా?
  • Pattadar Passbook Number Correct గా Enter చేశారా?
  • Captcha సరిగ్గా Enter చేశారా?

ఇవన్నీ Check చేసిన తర్వాత కూడా Information కనిపించకపోతే, Portal లో అందుబాటులో ఉన్న సంబంధిత Srvice లేదా Help/Support Option ను చూడండి. అవసరమైతే సంబంధిత Revenue Department అధికారులను సంప్రదించడం మంచిది.

Online Land Details కనిపిస్తే అది Final Ownership Proofనా?

ఇది చాలా ముఖ్యమైన విషయం. Bhu Bharathi లో Online లో కనిపించే Land Information ను చూసి Ownership కు సంబంధించిన Final Decision తీసుకోవడం మంచిది కాదు. Online Informationతో పాటు సంబంధిత Official Documents మరియు Recordsను కూడా Verify చేయాలి.

ఉదాహరణకు మీరు:

  • భూమి కొనాలని అనుకుంటున్నప్పుడు
  • భూమి అమ్మాలని అనుకుంటున్నప్పుడు
  • Registration చేయించుకునేటప్పుడు
  • Land dispute ఉన్నప్పుడు
  • Ownership verify చేయాల్సినప్పుడు

Online Land Details ఒక Useful Reference అయినప్పటికీ, ముఖ్యమైన Legal లేదా Property Decisionకు ముందు Official Recordsను Verify చేయడం చాలా ముఖ్యం.

Bhu Bharathi లో Land Details Check చేయడానికి Mobile లో కూడా వీలుందా?

Bhu Bharathi Portal Web-Based Service కావడంతో, Compatible Mobile Browser ద్వారా Website ను Access చేయవచ్చు. Mobile లో Website Open చేసినప్పుడు Screen చిన్నగా ఉండటం వల్ల Dropdowns లేదా Buttons సరిగ్గా కనిపించకపోతే Browser లో Desktop View Option ను ప్రయత్నించవచ్చు. అయితే website లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న Services మరియు Interfaceను బట్టి Process కొద్దిగా మారవచ్చు.

Bhu Bharathi Official Website ఏది?

Bhu Bharathiకి సంబంధించిన Information కోసం Official Telangana Government Portal నే ఉపయోగించడం Safest Option. Third-Party Websites లో Information చదివినా, Actual Land Record Information ను మాత్రం Official Portal లో Verify చేయడం మంచిది.

Frequently Asked Questions

Q1. Bhu Bharathi లో Land Details ఎలా చెక్ చేయాలి?

Ans. Bhu Bharathi Portal లో Land Details Search service open చేసి District, Mandal, Village select చేయాలి. తర్వాత Survey Number / Sub-Division Number లేదా Available Option ప్రకారం Pattadar Passbook Number తో search చేసి Fetch Details పై click చేయవచ్చు.

Q2. Survey Number తో Bhu Bharathi Land Details చూడవచ్చా?

Ans. అవును. Portalలో Survey Number / Sub-Division Number search option అందుబాటులో ఉంటే దాని ద్వారా land details search చేయవచ్చు.

Q3. Pattadar Passbook Number తో Land Details check చేయవచ్చా?

Ans. Portalలో ఆ search option అందుబాటులో ఉంటే Pattadar Passbook Number ను ఉపయోగించి సంబంధిత land record information ను search చేయవచ్చు.

Q4. Bhu Bharathi లో నా land record కనిపించకపోతే?

Ans. ముందుగా District, Mandal, Village, Survey Number లేదా Passbook Number వంటి details ను మరోసారి verify చేయండి. సమస్య కొనసాగితే సంబంధిత official support లేదా Revenue authorities ను సంప్రదించండి.

Q5. Bhu Bharathi Land Details mobile లో check చేయవచ్చా?

Ans. అవును, Compatible Mobile Browser ద్వారా Bhu Bharathi Website ను Access చేయవచ్చు. Website Interface లేదా Servicesలో మార్పులు ఉంటే Portal లో కనిపించే Current Instructions ను follow చేయండి.

Q6. Bhu Bharathi లో కనిపించే Land Details పై మాత్రమే ఆధారపడి భూమి కొనవచ్చా?

Ans. భూమి కొనుగోలు వంటి ముఖ్యమైన నిర్ణయాలకు online information ఒక్కటినే ఆధారంగా తీసుకోవడం మంచిది కాదు. సంబంధిత title documents, official records మరియు అవసరమైన legal verification కూడా చేయాలి.

చివరిగా

Bhu Bharathiలో land details check చేయడం మొదటిసారి చూస్తే కొంచెం complicated గా అనిపించవచ్చు. కానీ District → Mandal → Village → Survey Number / Sub-Division Number లేదా Pattadar Passbook Number → Captcha → Fetch Details అనే basic flow గుర్తుపెట్టుకుంటే process సులభంగా అర్థమవుతుంది.

అయితే మీ Land Recordలో ఏదైనా Discrepancy కనిపిస్తే, Online Informationను వెంటనే Final గా భావించకుండా సంబంధిత Official Recordsతో Verify చేయండి.

Official Source

Telangana Bhu Bharathi Official Portal: Bhu Bharathi Telangana
Source: Telangana Government / Bhu Bharathi Official Portal
Last Updated: August 15, 2026
Disclaimer: ఈ article ఒక independent informational guide మాత్రమే. ఇది Telangana Government యొక్క official website కాదు. Bhu Bharathi services, procedures, available fields మరియు Rules లో మార్పులు రావచ్చు. తాజా మరియు అధికారిక information కోసం Bhu Bharathi Telangana Official Portal ను verify చేయండి.

You Might Also Like

Leave a Comment